రాహుల్ గాంధీ కోసం రక్తంతో లేఖ

by Shamantha N |
రాహుల్ గాంధీ కోసం రక్తంతో లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: సోనియా గాంధీకి ఓ కాంగ్రెస్ నేత రాసిన లేఖ వైరల్‌గా మారింది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే ఎన్నుకోవాలని ఢిల్లీలోని కంటోన్మెంట్ బోర్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నేత సందీప్ తన్వార్ తన రక్తంతో లేఖ రాశారు. ‘‘ సోనియా గాంధీ గారికి నమస్కారం. రాహుల్ గాంధీ కోసం దేశవ్యాప్తంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నినదిస్తున్నాడు. ఇకపై పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా రాహుల్ గాంధీనే నియమిస్తారని అశిస్తూ రక్తతర్పణం చేస్తున్నాను. రాహుల్ గాంధీ కాక మరే ఇతర నేతను ఎన్నుకున్న పార్టీకి మంచిది కాదు.’’ అని సందీప్ లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story