- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ.. పిచ్చోడి చేతిలో రాయి: రేణుకా చౌదరి
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందని కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి విమర్శించారు. ఒక టీవీ ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ, ఏపీలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. సమయమంతా వృధా అయిపోతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల మనోభావాలు తెలుసుకోవడం లేదని విమర్శించారు. చంద్రబాబునాయుడుని విమర్శించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా మారిందని ఆమె మండిపడ్డారు. జగన్ తన అజెండా ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది తప్ప, కక్షా రాజకీయాలు అనవసరమని అభిప్రయపడ్డారు. ఒక రాజధానికే దిక్కు లేనప్పుడు, మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల సామాన్యుడికి ఒరిగేదేంటని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు మారినా ‘ప్రభుత్వం’ అనేది నిరంతరం కొనసాగుతుందని, ఈ విషయమే అర్థం కాకపోతే ఇంకేమంటామంటూ ఆమె విమర్శించారు.
tags: renuka chowdhury, congress, ysrcp, comments