- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది’
దిశ, మణుగూరు: ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ 51వ జన్మదిన వేడుకలు భద్రాద్రికొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామంలో కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి, ఉచితంగా వైద్యం అందించారు. ఈ వేడుకల్లో భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొని, హెల్త్ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పొదెం మాట్లాడుతూ.. స్వతంత్ర సమరయోధుడి వారసుడైన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పేదల పక్షాన ఉండి పోరాటాలు చేస్తామన్నారు. కరోనా విస్తరిస్తోన్న విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలు సరైనవి కాదని హితవు పలికారు.
కొత్తమల్లెపల్లి గ్రామంలో ప్రజలకు డెంగ్యూ, మలేరియా, విషజ్వరాలు వచ్చినా.. టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ వర్షాకాలంలో రోగాలు ఎక్కువగా వస్తాయన్న ఉద్దేశ్యంతో గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. గతంలో ఈ గ్రామంలో చాలామంది డెంగ్యూ, మలేరియా, డయేరియా రకరకాల విషజ్వరాలతో చనిపోయారని, అందుకే పీసీసీ, డీసీసీ ఆలోచన ద్వారా కొత్తమల్లెపల్లి గ్రామంలో క్యాంపు నిర్వహించామని వెల్లడించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రజలకు మంచి రోజులు వస్తాయని ఆయన తెలిపారు. హెల్త్ క్యాంప్ కు సహకరించిన డాక్టర్లు రమేష్ చంద్ర, శశిధర్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ కన్వీనర్ చందా సంతోష్, కో-కన్వీనర్ గురజాల గోపి, పట్టణ అధ్యక్షులు నవీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, నాయకులు లక్ష్మణ్, నూరుద్దీన్, సాంబశివరావు, రామ్మూర్తి, షరీఫ్, సాంబశివరావు, రాములు, విజయలక్ష్మి, వరలక్ష్మీ, శబనా, సౌజన్య, రజిని తదితరులు పాల్గొన్నారు.