- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నన్ను నమ్మండి నేను పోర్న్ వీడియోలు చూడలేదు: ఎమ్మెల్సీ
దిశ,వెబ్‌డెస్క్: కర్ణాటక అసెంబ్లీలో అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అదే బడ్జెట్ సమావేశాల గురించి శాసన మండలిలో చర్చ జరిగింది. అయితే బడ్జెట్ నచ్చలేదో లేదంటే ఆ సమావేశానికి రావడం ఆయనకు ఇష్టం లేదో కానీ ప్రకాష్ రాథోడ్ అనే కాంగ్రెస్ ఎమ్మెల్సీకి బోర్ కొట్టింది. ఏం చేయాలో తోచలేదు. మొబైల్ చూస్తూ కూర్చున్నాడు. దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ శాసన మండలిలో బడ్జెట్ ప్రసంగాన్ని చిత్రీకరిస్తున్న ఓ మీడియా ప్రతినిధికి మాత్రం అనుమానం కలిగి ఆయనవైపు కెమెరా తిప్పాడు. అంతే ఆయన చేస్తున్న పనికి ఆ కెమెరామెన్ షాక్ తిన్నాడు. కెమెరా మెన్ నిర్ఘాంతపోయేలా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా..?మొబైల్ లో నీలిచిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేశాడు. అనంతరం మొబైల్ను జేబులో పెట్టుకున్నాడు. అప్పటికే గ్యాలరీలో ఉన్న కెమెరామెన్ ప్రకాష్ రాథోడ్ చూస్తున్న నీలిచిత్రాల్ని క్యాప్చర్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. అయితే వైరల్ అవుతున్న వార్తల్ని ప్రకాష్ రాథోడ్ ఖండించారు. తాను ఆ పోర్న్ వీడియోలు చూడలేదని, గ్రామీణాభివృద్ధిపై మంత్రితో మాట్లాడుతున్నట్లు చెప్పాడు. అందుకు సంబంధించిన ప్రశ్నల కోసం సెల్‌ఫోన్‌లో వెతుకుతున్నానని వివరణ ఇచ్చారు. రాథోడ్ చేసిన పనిని బీజేపీ తప్పుపట్టింది. వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది.