- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రక్షాళన చేయకుంటే ప్రమాదమే : మర్రి
X
దిశ, వెబ్‌డెస్క్: గతకొన్ని రోజులుగా హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంభవించిన వరదలు ఇళ్లలోకి చేరి, అనేక కుటుంబాలు అతలాకుతలం అయ్యాయి. రోడ్లు, ధ్వంసం కావడంతో పాటు అనేక కాలువలు కట్టలు తెంచుకున్నాయి. కాగా దీనిపై శుక్రవారం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ మాజీ వైస్ చైర్మన్ మర్రి శశిధర్‌రెడ్డి స్పందించాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విపత్తు నిర్వహణకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని అన్నారు. విపత్తులకు ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలను ప్రభుత్వం చేపట్టడం లేదన్నారు. ప్రభుత్వం అనుకుంటే హైదరాబాద్ పునఃనిర్మాణం సాధ్యమే అని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా మూసీనదిని ప్రక్షాళన చేయకుంటే భవిష్యత్తులో హైదరాబాద్‌కు ప్రమాదమేనన్నారు.
Advertisement
Next Story