- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్‌కు బిగ్ షాక్: గులాబీ గూటికి శ్రీధర్ బాబు?
దిశ ప్రతినిధి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మిస్సింగ్ వ్యవహారం తరువాత అధిష్టానం సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతోందా..? జిల్లాలో బలమైన నాయకుని కోసం అన్వేషిస్తోందా? అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అవుననే ప్రచారం జరుగుతోంది. రాజకీయ సమీకరణాలను మార్చి గులాబీ పార్టీ గుబాలించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరించే ప్రణాళికలు సాగుతున్నాయన్న చర్చలు సాగుతున్నాయి.
కాంగ్రెస్ టూ టీఆర్ఎస్..
మాజీ మంత్రి, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా వ్యవహరించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రస్తుతం మంథని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయనకంటూ ప్రత్యేకంగా కేడర్ ఉండడంతో పాటు ఒంటిచేత్తో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో తనదైన పట్టు సాధించుకున్నారు. దీంతో ఆయన్ను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారన్న ప్రచారం సాగుతోంది. ఉద్యమ ప్రస్థానం నుంచి టీఆర్ఎస్‌లో ఉన్న ఈటల రాజేందర్ ఎపిసోడ్ తరువాత బలమైన నాయకుడు అవసరమని భావిస్తున్న టీఆర్ఎస్ అధిష్టానం శ్రీధర్ బాబు వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన్ను పార్టీలోకి తీసుకున్న తరువాత మంత్రి పదవి కట్టబెట్టినట్టయితే పట్టు కోల్పోకుండా ఉండే అవకాశాలు ఉంటాయని టీఆర్ఎస్‌లోని ఓ వర్గం చర్చించుకుంటోంది. దీంతో పుట్ట మధు ఎపిసోడ్‌కు బ్రేక్ పడనుందని కూడా జిల్లాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఒకప్పుడు నీకు బాసే కదా…
మంథని రాజకీయాల్లో శ్రీధర్ బాబు నాలుగోసారి ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానం శ్రీధర్ బాబు పేరును ప్రతిపాదించి, ‘‘ఒకప్పుడు నీవు ఆయన నీడలోనే పెరిగావు. ఇప్పుడు కూడా అలాగే ఉండాలి’’ అనే సంకేతాలను పుట్ట మధుకు అధిష్టానం పంపించినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీధర్ బాబు కూడా సమ్మతించారని నేడో రేపో పుట్ట మధు తెరపైకి వస్తారని మంథనిలో చర్చించుకుంటున్నారు. అధిష్టానం లక్ష్యం నెరవేరడం, అన్నింటా తాము సక్సెస్ కావడంతో పాటు హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలను సైతం దుద్దిళ్లకే అప్పగించాలని యోచిస్తున్నారని కూడా మంథని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. ఇదే విషయమై మంథని కాంగ్రెస్ నాయకులను ‘దిశ’ ప్రశ్నించినప్పుడు అవన్ని పుకార్లేనని కొట్టి పారేస్తున్నారు. శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీని వీడరని స్పష్టం చేస్తున్నారు.
ఒకే ఒరలో రెండు కత్తులా..?
ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడవన్న సామెతకు తగ్గట్టుగా ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ప్రచారమే నిజమైతే శ్రీధర్ బాబు, పుట్ట మధులు ఒకే పార్టీలో కొనసాగుతారా? అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. శ్రీధర్ బాబుతో ఉన్న వైరం కారణంగానే పార్టీ మారిన పుట్ట మధు రేపు ఆయనతో కలిసి టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి పనిచేస్తారా అన్నదే ఇప్పుడు అంతుచిక్కకుండా తయారైంది. అయితే మంథనిలో జరుగుతున్న పరిణామాలపై ఇప్పటి వరకూ శ్రీధర్ బాబు మాత్రం నోరు మెదపలేదు. మరి దీనిపై ఏ విధింగా స్పందిస్తారో వేచి చూడాలి.