- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ సీఎం అవుతారు.. మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
దిశ, షాద్‌నగర్: షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి మొట్టమొదట పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచి, ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన బూర్గుల రామకృష్ణారావు మాదిరిగానే రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అవుతారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలో ఈనెల 12న పాలమూరులో నిర్వహించనున్న ‘విద్యార్థి-నిరుద్యోగ సైరన్’కు సంబంధించిన సన్నాహక సమావేశం వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లురవి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యాక మొట్ట మొదట ‘దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా’ కార్యక్రమాన్ని నెలరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిపించారని అన్నారు.
రెండో కార్యక్రమంగా నిరుద్యోగులకు, విద్యార్థులకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయానికి వ్యతిరేకంగా ‘విద్యార్థి-నిరుద్యోగ జంగ్ సైరన్’ కార్యక్రమాన్ని తీసుకోవడం గొప్ప పరిణామమన్నారు. మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో జరుగబోయే కాంగ్రెస్ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన రేవంత్ రెడ్డి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు అయ్యారని, ఖచ్చితంగా మళ్ళీ బూర్గుల తరువాత జిల్లా నుంచి రేవంత్ రెడ్డి సీఎం కాబోతున్నారని మల్లురవి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో సమావేశంలో పాల్గొన్న కార్యకర్తలు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు బాబర్ ఖాన్, రాంరెడ్డి, రఘు, పురుషోత్తం రెడ్డి, హరినాథ్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.