టీఆర్ఎస్‌ సర్కా‌ర్‌పై కాంగ్రెస్ నేత ప్రశంసలు

by Anukaran |   ( Updated:2020-07-26 05:59:44.0  )
టీఆర్ఎస్‌ సర్కా‌ర్‌పై కాంగ్రెస్ నేత ప్రశంసలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. ప్రస్తుత కరోనా సమయంలో కేసీఆర్ సర్కార్ చేస్తున్న కార్యక్రమాలను కొనియాడారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ సమర్థవంతంగా పనిచేస్తూ కొవిడ్ 19ను నియంత్రిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా తక్కువే ఉన్నయన్నారు. ప్రభుత్వం గొప్ప ఆరోగ్య సంరక్షణతో పాటు ఆస్పత్రుల్లో తగినన్ని బెడ్‌లను ఏర్పాటు చేసిందన్నారు. కష్టకాలంలో సమర్థవంతంగా పనిచేస్తున్నా కేసీఆర్, కేటీఆర్‌ను అభినందిస్తున్నట్లు ఆదివారం ఆయన మీడియాతో చెప్పారు.

నిన్న మొన్నటివరకు కేసీఆర్, కేటీఆర్‌తో పాటు ఇతర టీఆర్ఎస్ నేతలపై ఒంటికాలిపై లేచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒక్కసారిగా స్వరం మార్చేసరికి టీఆర్ఎస్‌, కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విశ్వేశ్వర్‌రెడ్డి ఓటమి పాలయ్యారు.

Advertisement

Next Story