వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసిందే కాంగ్రెస్

by Shyam |
Congress leader Janga Raghavareddy
X

దిశ, జనగామ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులపై కపట ప్రేమను ఒలకబోస్తున్నాయని జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి విమర్శించారు. దాదాపు 700 మంది రైతులు మరణం తర్వాత వ్యవసాయ చట్టాలను రద్దు చేసి, తమది రైతు ప్రభుత్వమని కేంద్రం చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరాల పాటు రైతులు పోరాటం చేస్తే, ఏనాడూ సందర్శించి మద్దతు తెలుపని ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులపై కపటప్రేమను చూపుతున్నారని అన్నారు. శనివారం జనగామ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో రాఘవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసి, రుణాలు ఇచ్చి, మద్దతు ధర కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు.

ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం జరిగితే నష్ట పరిహారం కల్పించి రైతులను ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. క్వింటాలుకు 10 కిలోలు కట్ చేసి మిల్లర్లు రైతులను దోచుకుతింటున్నారని, అయినా పట్టించుకోకుండా, తమది రైతుల ప్రభుత్వం అని చెప్పుకోవడం సిగ్గుమాలిన చర్య అని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని, రైతులకు మద్దతు ధర ఇవ్వాలని పోరాటాలు చేసింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. ఎప్పటికైనా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి, రైతుల గురించి అధికార పార్టీలపై కొట్లాడేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed