ఆ నేత కోసం ప్రధాని, సీఎంకు జానారెడ్డి లేఖ

by Shyam |   ( Updated:2020-07-23 06:57:09.0  )
ఆ నేత కోసం ప్రధాని, సీఎంకు జానారెడ్డి లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: విరసం నేత వరవరరావు విడుదల కోసం కవులు, కళాకారులు, రాజకీయ నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఇప్పటికే ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు వరవరరావు విడుదల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఈ అంశంపై స్పందించారు. వరవరరావుకు బెయిల్ మంజూరు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. ఈ మేరకు జానారెడ్డి గురువారం ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌లకు లేఖలు రాశారు.

ప్రస్తుతం వరవరరావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని.. ఆయన కరోనా, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జానారెడ్డి లేఖలో పేర్కొన్నారు. వరవరరావు ఆరోగ్యం, బాగోగులు చూసుకోవడానికి వారి కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా, బీమా-కోరేగావ్‌ కేసులో వరవరరావు రెండేళ్లుగా మహారాష్ట్ర జైల్లో ఉన్నారు. ఈనేపథ్యంలో ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story