రాబందుల్లా దోచుకు తింటున్నారు: శ్రవణ్

by Shyam |   ( Updated:2020-12-09 08:50:47.0  )
రాబందుల్లా దోచుకు తింటున్నారు: శ్రవణ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార పార్టీ నేతల భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని ఏఐసీసీస అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్​ ఆరోపించారు. భూ కబ్జాలో ఉండి, కేసు నమోదైన మంత్రి మల్లారెడ్డిని పదవి నుంచి వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం గాంధీభవన్​లో శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డిపై భూకబ్జా కేసు నమోదైందని, ఆయన కొడుకు భద్రారెడ్డితో పాటు ఐదుగురు అనుచరులపై దుండిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. తప్పుడు పత్రాలు సృష్టించి సూరారంలో 20గుంటల భూమిని కొంత బలవంతంగా ఆక్రమించుకొని, మిగిలిన భూమిని సైతం అమ్మాలని ఒత్తిడి చేస్తున్నారని, లేకుంటే చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారని శ్రవణ్ వివరించారు.

రాష్ట్రంలో మంత్రుల తీరు చూస్తుంటే కంచే చేను మేసినట్లుందని, టీఆర్ఎస్ నేతల అవినీతికి అంతులేకుండా పొయిందని, రాబందుల్లా దోచుకుతింటున్నారని విమర్శించారు. మంత్రి మల్లారెడ్డి భూకబ్జాల్లో ఓ రాబందుడని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సర్వే నెంబర్లుతో సహా బాధితురాలు మంత్రి మల్లారెడ్డి అవినీతి, దౌర్జన్యాన్ని బయటపెట్టిందని, మల్లారెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్​కు నిబద్ధత ఉంటే మల్లారెడ్డిని వెంటనే అనర్హుడిగా ప్రకటించాలని, లేదంటే కేసీఆర్ తమది అవినీతి ప్రభుత్వమేనని ఒప్పుకోవాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed