మున్సిపల్ ఎన్నికలు ఫేక్ ఎన్నికలు : చింతా మోహన్ ధ్వజం

by srinivas |
chinta mohan
X

దిశ, వెబ్ డెస్క్: ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై కాంగ్రెస్ నేత చింతా మోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియ మధ్యలో చేతులెత్తేశారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో నిమ్మగడ్డ… ఐస్‌గడ్డలా కరిగిపోయారంటూ ఎద్దేవా చేశారు. 1952 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి ఎన్నికలను చూడటం ఇదే మెుదటిసారన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారని మండిపడ్డారు.

కర్ణాటక, తెలంగాణ లిక్కర్, ఎర్రచందనం వంటి అక్రమ కేసులు పెడతామని పోటీదారులను బెదిరించి, భయపెట్టి ఏకగ్రీవాలు చేయించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పురపాలక, నగర పాలక సంస్థ ఎన్నికలు ఫేక్ ఎన్నికలని అభిప్రాయపడ్డారు. రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లు ఎన్నికల కమిషనర్ పదవి చేపట్టకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం శుభ సూచకమన్నారు. రూ.300 కోట్లతో టీటీడీ చిన్న పిల్లల ఆస్పత్రి నిర్మాణం చేస్తామని, ఎన్నికలకు ముందు ఎంఓయూ చేసుకోవడం ఒక రాజకీయ జిమ్మిక్కు అని వ్యాఖ్యానించారు. రూ. 300 రూపాయలు లేని అతను, మూడు వందల కోట్లు పెట్టి ఆస్పత్రిని ఎలా నిర్మిస్తాడని మాజీ ఎంపీ చింతా మోహన్ ప్రశ్నించారు.

Advertisement

Next Story

Most Viewed