- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మల్లారెడ్డివి తాగుబోతు మాటలు.. చెవిటి వెంకన్న ఆగ్రహం
దిశ, సూర్యాపేట: మంత్రి మల్లారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ చెవిటి వెంకన్న యాదవ్ ఖండించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం వెంకన్న యాదవ్ మాట్లాడుతూ.. ‘‘మల్లారెడ్డి ఖబడ్దార్.. నీ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు. లోక్‌సభ ఎన్ని్కల్లో మీ అల్లుడిపై రేవంత్ రెడ్డి గెలిచింది మరిచిపోయావా? మరోసారి మా రేవంత్ రెడ్డి మీద ఇలాంటి మాటలు మాట్లాడితే తెలుగు భాషలో లేని పదాలను వెతికి నిన్ను తిట్టవలసి వస్తుంది. నీ లాగా బజార్ మాటలు, నీతి మాలిన దిగజారుడు, తాగుబోతు మాటలు మేము మాట్లాడాలేము. ఇకనైనా మర్యాదతో మంచిగా మాట్లాడటం నేర్చుకో. మాకు కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడిన రాజకీయం నేర్పింది. నీలాగా చిల్లర రాజకీయాలు మాకు రావు. ఇలాంటి మరోసారి మాట్లాడితే రోడ్డుమీద తిరగకుండా చేస్తాం.’’ వెంకన్న యాదవ్ హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్ గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు పొలగాని బాలుగౌడ్, పచ్చిపాల వెంకన్న యాదవ్, జిల్లా కార్యదర్శులు నాగుల వాసు, అక్కేనపల్లి జానయ్య, పిడమర్తి మల్లయ్య, నియోజకవర్గ యువజన అధ్యక్షుడు నెల్లుట్ల లింగాస్వామి, జిల్లా అధికార ప్రతినిధి కుందమల్ల శేఖర్, జిల్లా ప్రచార కార్యదర్శి ఆలేటి మాణిక్యం, పట్టణ యువజన అధ్యక్షుడు వల్దాసు శ్రీను, జిల్లా మహిళా నాయకురాలు దుశ్చర్ల మంజుల, సువర్ణ, నాయకులు రేతినేని శ్రీనివాసరావు, గార్లపాటి వెంకట్ రెడ్డి, మన్నెం మల్లేష్, అన్నమయ్య, రాము, చెరుకు రవి కుమార్, రెడ్ హౌస్ ఇంచార్జి నరేందర్ నాయుడు, పగిడిమర్రి నవీన్ కుమార్, గుణగంటి సైదులు, చింతల నాగరాజు, అశోక్ యాదవ్, కుమార్ యాదవ్, జానీ, సిద్ధి రాము, భార్గవ్ రెడ్డి, మధు పాల్గొన్నారు.