- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆలయాలు కూల్చిన… బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఆవరణంలోని ప్రార్ధన మందిరాలను తొలగించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు. సచివాలయంలో ఆవరణంలోని నల్ల పోచమ్మ, మసీదులు కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్‌కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహ్మరెడ్డి మాట్లాడుతూ… టీఆర్ఎస్ ప్రభుత్వం నియంతృత్వంగా పరిపాలన సాగిస్తుందని విమర్శించారు.
ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రశ్నించే నాయకులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రయత్నం చేస్తుందన్నారు. ఆ విమర్శలను సూచనలుగా పరిగణిస్తే రాష్ట్ర ప్రభుత్వం పురోగతి సాధిస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రజలు కరోనా మహమ్మారితో ఆర్ధిక ఇబ్బందులు, వైద్య సదుపాయం లేక అవస్థలు పడుతున్నారని, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితిలో ప్రజారోగ్యంపై జాగ్రత్తలు తీసుకోకుండా నూతన భవన నిర్మాణాలపైనే శ్రద్ద చూపిస్తున్నారని అన్నారు. కాంట్రాక్టర్ల ద్వారా వచ్చే కమీషన్‌పై ఉన్న ఆసక్తి ప్రజల సమస్యలపై లేదని విమర్శించారు.