- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారికి న్యాయం జరగాలంటే.. సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలి
దిశ, మహేశ్వరం: మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి, సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి, ఏనుగు జంగారెడ్డిలు డిమాండ్ చేశారు. ‘దళితబంధు’ రాష్ట్రవ్యాప్తంగా వెంటనే అమలు చేయాలని బుధవారం మహేశ్వరం తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వో జ్యోతికి, తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో ఎండీ పర్వతాలుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేస్తే మహేశ్వరం నియోజకవర్గంలోని 60 వేల కుటుంబాలకు ‘దళితబంధు’ వస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఒక్క హుజురాబాద్ నియోజకవర్గానికే ముఖ్యమంత్రి అనేలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని విమర్శించారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేశాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి జానికీరామ్, మహేశ్వరం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కాకి ఈశ్వర్, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జంపన్న యాదవ్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.