- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు గడ్డపై గర్జించనున్న రేవంత్.. రెండు లక్షల మందితో ‘జంగ్ సైరన్’
దిశ, షాద్ నగర్: పాలమూరు గడ్డపై రెండులక్షల మందితో ‘జంగ్ సైరన్’ మోగిస్తామని కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి అన్నారు. ఆదివారం షాద్‌నగర్ పట్టణంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో ‘జంగ్ సైరన్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 12న పాలమూరు గడ్డపై టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి మొదటిసారి యుద్ధభేరి మోగించబోతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ‘‘నీళ్లు, నిధులు, నియామకాలు’’ అంటూ తెలంగాణ యువతను, విద్యార్థులను మోసం చేసిన కేసీఆర్ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ‘జంగ్ సైరన్’ మోగించబోతున్నట్లు వెల్లడించారు.
అనంతరం వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. షాద్ నగర్ నియోజకవర్గం వేలాదిమందిని కూడగట్టుకొని పాలమూరు గడ్డపై రెండు లక్షల మందితో ‘జంగ్ సైరన్’ నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాబర్ ఖాన్, కృష్ణారెడ్డి, హరినాథ్ రెడ్డి, కొంకల చెన్నయ్య, ఆశన్న గౌడ్, రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు జగదీశ్వర్, బాలరాజు గౌడ్, కౌన్సిలర్ శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, పురుషోత్తం రెడ్డి, ఖదీర్, ముబారక్, అశోక్, గుట్ట రాజు, అశోక్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.