బిగ్ న్యూస్ : BJP ఎమ్మెల్యేను ఫినిష్ చేస్తే కోటి ఇస్తా.. కాంగ్రెస్ నేత ఆఫర్.. వీడియో లీక్

by Anukaran |   ( Updated:2021-12-01 23:35:54.0  )
బిగ్ న్యూస్ : BJP ఎమ్మెల్యేను ఫినిష్ చేస్తే కోటి ఇస్తా.. కాంగ్రెస్ నేత ఆఫర్.. వీడియో లీక్
X

దిశ, వెబ్‌డెస్క్ : బీజేపీ ఎమ్మెల్యేను ఖతం చేస్తే కోటి నజరానా అంటూ కాంగ్రెస్ నేత చేసిన కామెంట్స్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కామెంట్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత గోపాలకృష్ణ.. బీజేపీ ఎమ్మెల్యే ఎస్‌ఆర్ విశ్వనాథ్‌ను మర్డర్ చేయాలంటూ ఓ వ్యక్తితో మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది.

ఆ వీడియోలో విశ్వనాథ్‌ను ఫినిష్ చేస్తే కోటి రూపాయలు నజరానా ఇస్తాను. ఈ విషయం మన ఇద్దరి మధ్యే ఉండాలంటూ మాట్లాడుకున్నారు. చివరకు ఆ వీడియో బయటకు రావడంతో కర్ణాటక పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు గోపాలకృష్ణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ వీడియో సంభాషణ ఎప్పుడు జరిగింది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ విషయంపై కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ఎమ్మెల్యే విశ్వనాథ్‌కు భద్రత కల్పించునున్నట్టు తెలిపారు. వీడియోపై పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

ఫలించిన ఈటల వ్యూహం.. బీజేపీ గూటికి టీఆర్ఎస్ నేతలు!

Advertisement

Next Story

Most Viewed