పుట్ట మధు తన ఓటును టీఆర్ఎస్‌ అభ్యర్థికే వేశాడా..?

by Sridhar Babu |
పుట్ట మధు తన ఓటును టీఆర్ఎస్‌ అభ్యర్థికే వేశాడా..?
X

దిశ, రామగిరి : పుట్ట మధుకు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం దగ్గర గుర్తింపు లేదని, ప్రజల్లో చులకన అయిపోతారనే భయంతో ఎన్నికల్లో గెలవలేని వ్యక్తులతో చిల్లర మాటలు మాట్లాడిస్తున్నారని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట చంద్రయ్య, మంథని నియోజక వర్గ యూత్ అధ్యక్షుడు బర్ల శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధిష్టానం దగ్గర గుర్తింపు ఉంటే మొన్న జరిగిన హుజరాబాద్ ఎలక్షన్లలో అధిష్టానం మీకు ఇచ్చిన గుర్తింపు ఎక్కడ అన్నారు. స్వయానా ఒక మంత్రి పుట్ట మధు, ఆయన అనుచరుల గురించి ఫోన్‌లో మాట్లాడిన ఆడియోకు సమాధానం చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్‌తో కుదిరిన చీకటి ఒప్పందం ఎక్కడ బయటపడుతుందనే భయంతో మా నాయకుడు శ్రీధర్ బాబు, ఎంపీటీసీలు ఎంపీపీలు, జడ్పీటీసీల పైన అసత్య ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. నమ్మిన వాళ్లను మోసం చేసే చరిత్ర ఎవరిదో ఆనాడు మంథని ప్రజలకు, ఈనాడు టీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి తెలిసింది అన్నారు.

కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అభ్యర్థిని పోటీలో నిలుపలేదు కాబట్టి శ్రీధర్ బాబు ఓటు వేయలేదనే విషయం గుర్తించు కోవాలన్నారు. మెదక్ గజ్వేల్ మున్సిపల్ అఫీషియల్ మెంబర్ అయిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఉన్న ఓటు హక్కు ఎందుకు వినియోగించుకోలేదని ప్రశ్నించారు. ప్రజాసమస్యల కోసం కొట్లాడే శ్రీధర్ బాబుపై అసత్య ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని హెచ్చరించారు. ఎంపీటీసీ, సర్పంచ్, వార్డ్ మెంబర్ గా కూడా గెలవలేని వ్యక్తులు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిని విమర్శిస్తే మీకు పుట్టగతులు ఉండవనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీలు చిందం మహేష్, కొప్పుల గణపతి, కొట్టే సందీప్, సెంటినరీ కాలనీ టౌన్ అధ్యక్షుడు కాటం సత్యం, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకురాలు రాధా రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేగోలపు శ్రీనివాస్, రైతు సంఘం అధ్యక్షుడు ఉడుత శంకర్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed