కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి..

by Anukaran |   ( Updated:2020-11-24 20:44:29.0  )
కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి..
X
దిశ,వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌ పటేల్‌ బుధవారం మృతి చెందారు. కరోనా చికిత్స పొందుతూ గురుగావ్‌లోని వేదాంత ఆస్పత్రిలో ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఫైసల్‌ పటేల్‌ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఆయనకు నెల రోజుల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం ఇటీవల మరింత క్షీణించింది. కాగా ఈ రోజు ఉదయం గం. 3.30లకు ఆయన తుది శ్వాస విడిచారని ఆయన కుమారుడు ట్టిట్టర్‌లో వెల్లడించారు. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీకి ఆయన రాజకీయ సలహాదారునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2004, 2009లో కాంగ్రెస్‌ విజయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు.

Advertisement

Next Story