- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కాంగ్రెస్ భిక్షమేస్తే ముఖ్యమంత్రివి అయ్యావ్.. అద్దంకి సంచలన వ్యాఖ్యలు
దిశ, జవహర్‌నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లిలో టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష’ చేస్తోన్న విషయం తెలిసిందే. బుధవారం దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన అద్దంకి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ భిక్షమేస్తే ముఖ్యమంత్రివి అయ్యావు.. కేసీఆర్ గుర్తుపెట్టుకో అని హితవు పలికారు. ఈ రాష్ట్రంలో భూదాన్, దళిత భూములను దోచుకోవాడానికే అధికారంలోకి వచ్చారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రౌడీలను పెట్టి రేవంత్ దీక్షను అడ్డుకోవడానికి చూస్తారా.. కాంగ్రెస్ కార్యకర్తలు తొక్కితే టీఆర్ఎస్ చిల్లర రౌడీలందరూ పారిపోయారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని తిడుతుంటే బీజేపీకి ఎందుకు బాధ అవుతుందో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏజెంట్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ-టీఆర్ఎస్ దొందు దొందే అని ప్రభుత్వ నియంతృత్వ విధానాలను ఎత్తిచూపి పోరాడేది కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అని అన్నారు. తెలంగాణకు టీపీసీసీ చీఫ్, మల్కాజిరిగి ఎంపీ రేవంత్ రెడ్డి పెద్ద కొడుకు లాంటి వ్యక్తి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.