- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్వలాభం కోసం ఆరాటపడుతున్నావా.. MLA గండ్రపై కీర్తి రెడ్డి ఫైర్
దిశ, చిట్యాల : అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి కృషి చేయడంలేదు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి స్వలాభాల కోసమే ఆరాటపడుతున్నాడని బీజేపీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జీ చందుపట్ల కీర్తి రెడ్డి ఆరోపించారు. మంగళవారం చిట్యాల మండలంలోని కాల్వపల్లి గ్రామ శివారులో అకాల వర్షాల కారణంగా కొట్టుకుపోయిన పంటలను బీజేపీ శ్రేణులతో కలిసి ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మొద్దునిద్ర వీడి పంటలకు నష్టపరిహారం చెల్లించే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. రైతులకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ. 50 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర.. నష్ట పోయిన రైతుల పంటలను పరిశీలించకపోవడం ఆయన అసమర్థతకు అద్దంపడుతున్నదని విమర్శించారు. ప్రజల సమస్యలను గాలికి వదిలేసి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పటికైనా స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా కృషి చేయాలని కోరారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, నాయకులు మాచర్ల రఘు, సయ్యద్, శ్రీనివాస్ రెడ్డి, ఐలయ్య, రవి, వెంకటేష్, రమణాచారి, లింగయ్య, రవీందర్ శంకర్, రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.