- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నల్లగొండపై సందిగ్ధంలో కాంగ్రెస్..!
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జరిగే మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలోనైనా పోటీ చేయాలని భావిస్తోంది. నల్గొండ జిల్లా నుంచి పోటీ చేసే అంశంపై నేతలు చర్చించారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ జూమ్ యాప్‌లో సోమవారం సమావేశమయింది. రాబోయే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అంశంపై చర్చించారు. నల్గొండ జిల్లాలో పోటీపై నాయకులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని ఆ జిల్లా నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. దీనిపై టీపీసీసీతో చర్చించాలని, దానిలో భాగంగా మంగళవారం మరో మారు భేటీ కావాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు గాంధీభవన్‌లో పీఏసీ సమావేశం ఉంటుందని ఈ సందర్భంగా వెల్లడించారు.
అదే విధంగా ఈ నెల 14 నుంచి నిర్వహించాల్సిన ప్రజా చైతన్య యాత్రలు వాయిదా పడటంతో దానికి బదులుగా డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శలు బోసురాజు, శ్రీనివాస్ కృష్ణన్, చిన్నారెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.