- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నిర్మలా జగ్గారెడ్డి ఏకగ్రీవ ఎంపిక
దిశ,మెదక్: మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిర్మలా జగ్గారెడ్డి తరఫున మంగళవారం మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీష్ సమక్షంలో నామినేషన్ పత్రాలను ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. అభ్యర్థి నిర్మలా జగ్గారెడ్డి, నర్సారెడ్డి, కంటారెడ్డి తిరుపతి రెడ్డి, కాట్ శ్రీనివాస్ గౌడ, తదితరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
ఈ సందర్భంగా దామోదర రాజనర్సిహం విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన అవినీతిమయంగా మారిందని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు త్వరలోనే గడీల పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. రాజకీయాలను కొనుగోలు కేంద్రాలుగా కల్వకుంట్ల ఫ్యామిలీ మార్చిందంటూ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, రైతులు ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారన్నారు.