హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వివరాలివే..

by Sridhar Babu |
హుజురాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి వివరాలివే..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయనున్న బల్మూరి వెంకట్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన ఆయన… అమ్మమ్మ గారి ఊరైన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారేపల్లిలో నివాసం ఉండేవారు. కొంతకాలం కిందట హైదరాబాద్ నారాయణ గూడలో ఉంటున్నారు. 1992 నవంబర్ 2న జన్మించిన ఆయన కరీంనగర్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఎన్‌ఎస్‌యూఐలో రాష్ట్ర అధ్యక్షునిగా పని చేస్తున్న ఆయన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed