- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అసెంబ్లీలో తొలిరోజే రణరంగం !
దిశ, ఏపీ బ్యూరో : అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొలిరోజునే రణరంగంగా మారాయి. తుపానుతో రైతులకు జరిగిన నష్టం, పరిహారం చెల్లింపులకు సంబంధించి చర్చ జరిగింది. సీఎం జగన్ మాట్లాడిన తర్వాత చంద్రబాబు మాట్లాడేందుకు ప్రయత్నించారు. అధికార వైసీపీ సభ్యులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా చంద్రబాబు ఆగ్రహంతో స్పీకర్ పోడియం ముందు బైఠాయించారు. ఆపై వాకౌట్ చేశారు. ఈ ఘటనపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చంద్రబాబు కావాలనే ఇలా చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సభ జరిగేదే ఐదు రోజులని చెప్పారు. కొవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటునే నడపడం లేదు. తెలంగాణలోనూ ఇదే కారణంతో అసెంబ్లీ సమావేశాలు జరగడం లేదు. కొన్ని ముఖ్యమైన బిల్లులను చర్చించేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సీఎం వివరించారు. ఇలాంటి కీలక సమయంలో సభ జరగనివ్వకుండా విపక్ష నేతలు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏనాడూ ఓ విపక్ష నేత ఫ్లోర్ లో బైఠాయించింది లేదని తెలిపారు. గతంలో తాను కూడా విపక్ష నేతగా వ్యవహరించినా ఇలా ఎప్పుడూ ప్రవర్తించలేదని గుర్తు చేశారు. చంద్రబాబు మాత్రం ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకోవాలన్న కారణంతో పోడియం ముందు కూర్చున్నాడని సీఎం జగన్ ఆరోపించారు.
టీడీపీ సభ్యుల సస్పెన్షన్
తుపాను వల్ల రైతులకు జరిగిన నష్టంపై చర్చలో సీఎం జగన్ ప్రసంగించిన తర్వాత ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లేడేందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో చంద్రబాబు స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేలు పరిహారంగా చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్చట్ట సవరణపై స్పందిస్తూ అసలు చర్చ జరగకుండానే బిల్లును ఎలా ఆమోదిస్తారని నిరసిస్తూ సభ నుంచి వాకౌట్చేశారు. సభను జరగకుండా అడ్డుకుంటున్నారని చంద్రబాబుతో పాటు 12 మంది టీడీపీ సభ్యులను స్పీకర్ ఒకరోజు సస్పెండ్ చేశారు. సస్పెండయిన వారిలో చంద్రబాబునాయుడుతోపాటు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, బెందాళం అశోక్, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, మంతెన రామరాజు, బాల వీరాంజనేయస్వామి, వెలగపూడి రామకృష్ణబాబు, ఆదిరెడ్డి భవానీ ఉన్నారు.
చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారు
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సభలో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై ఘాటుగా విమర్శించారు. టీడీపీకి అమరావతి రైతులు తప్ప మిగతా రైతులు కనిపించడంలేదన్నారు. గతంలో రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను మోసం చేసినట్లు చెప్పారు. సీఎం జగన్ రైతులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తున్నారని కొనియాడారు. వరదల సమయంలో ముందు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేసినట్లు కన్నబాబు వివరించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. డిసెంబరు నెలాఖరు నాటికి వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు పేర్కొన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ స్వయంగా ఏరియల్ సర్వే చేస్తే గాలి సర్వేలంటూ చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ పై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో హుద్ హుద్ తుపాను వస్తే అన్నీ తానే చేసినట్టు చంద్రబాబు పోజులిచ్చారని, అలా నటించడం తమ సీఎంకు చేతకాదని కన్నబాబు తెలిపారు.
ఆ బిల్లు పాతదే – సీఎం జగన్
గతంలో తీవ్ర చర్చకు దారితీసిన పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ జరగనిదే ఎలా ఆమోదిస్తారని టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సీఎం జగన్ స్పందించారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై గత సమావేశాల్లోనే చర్చ జరిగిందని స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును మండలికి పంపిస్తే దాన్ని వారు తిప్పి పంపారని, అందువల్ల మళ్లీ తిరస్కరించేందుకు వీల్లేదన్నారు. సభ ఆమోదించడం కేవలం లాంఛనమేనన్నారు. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు చేయకుండా చూడడం కోసం ఈ చట్ట సవరణ చేశాం. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు ఖర్చు పెడితే వారిపై చర్య తీసుకోవడానికి ఈ చట్టం ఉపకరిస్తుంది. విపక్ష నేత ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థంకావడం లేదంటూ సీఎం జగన్వ్యాఖ్యానించారు.