ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల ఘర్షణ

by Shyam |
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల ఘర్షణ
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్‌ జిల్లా తాండూరు మున్సిపాలిటీ సమీక్షా సమావేశంలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధికార టీఆర్ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల అనుచరులు… కార్యాలయ ఆవరణలో బాహాబాహికి దిగారు. ఇవాళ నిర్వహించిన సాధారణ సమావేశంలో అజెండా అంశాలపై చర్చించకుండా ఆమోదించినట్లు ప్రకటించగా… ప్రతిపక్షసభ్యులు అభ్యంతరం తెలిపారు. సమావేశం నుంచి ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వెళ్లిపోయారు. అనంతరం రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.

Advertisement

Next Story