- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మేసేజ్ చేస్తే చంపుతారా.. రక్తపాతం సృష్టించిన మృతుడి బంధువులు

దిశ, కోదాడ: బర్త్ డే రోజు ప్రియురాలిని విష్ చేసిన ప్రియుడిని యువతి బంధువులు దాడి చేసిన దారుణ ఘటన అతడి చావుకు కారణమైంది. అవమానభారంతో పురుగుల మందు తాగిన నరేష్ 20 రోజుల పాటు చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ విషాదం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధి గొండ్రియాలలో వెలుగుచూసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మృతుడి బంధువులు యువతి ఇంటి ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పడంతో శవాన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లారు. ఇదే క్రమంలో మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకు మృతిని జీర్ణించుకోలేకపోయిన కుటుంబీకులు పగతో రగిలిపోయారు. ఇదే క్రమంలో యువతి బంధువులపై మంగళవారం రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో ప్రియురాలి మేనమామ నెల్లూరు వెంకటేశ్వరరావు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ పరిణామాలతో గొండ్రియాలలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.