- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్యూటీ చేసే చోట గొడవ.. అదృశ్యమైన యువతి.. అసలేం జరిగింది…?
దిశ, కుత్బుల్లాపూర్ : పేదరికంలో ఉన్న కుటుంబం కోసం పనికి వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల గ్రామానికి చెందిన వెంకట్ కుటుంబం గత కొంతకాలంగా ఆర్థికంగా వెనుకబడింది. అయితే అతని కుమార్తె అనూజ(18) కుటుంబ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఇటీవలే ప్రారంభమైన సుచిత్ర లోని కిసాన్ షోరూమ్ లో పనికి కుదిరింది.
అయితే రోజు మాదిరిగానే ఈనెల 23వ తేదీన డ్యూటీకి వెళ్లిన అనూజ రాత్రైనా ఇంటికి రాలేదు. ఏమైందని కుటుంబ సభ్యులు షోరూమ్ కు వెళ్లి అడుగగా 23వ తేదీన షోరూమ్ లో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ విషయంపై పని చేసే వారితో పాటు యాజమాన్యంను అడుగగా సరైన సమాధానం రాకపోవడం గమనార్హం. బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ప్రయోజనం లేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.