రోజుకు 1.10లక్షల కరోనా టెస్టులు : కేంద్రం

by Shamantha N |
రోజుకు 1.10లక్షల కరోనా టెస్టులు : కేంద్రం
X

న్యూఢిల్లీ: మన దేశంలో రోజుకు 1.10 లక్షల కరోనా టెస్టులు నిర్వహిస్తున్నట్టు కేంద్రం ప్రభుత్వం వెల్లడించింది. 612 ల్యాబ్‌లలో ఈ టెస్టులు చేపడుతున్నట్టు తెలిపింది. మిగతా దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా మరణాలు (లక్షమందికి) స్వల్పంగా ఉన్నాయని, రికవరీ రేటు క్రమంగా పెరుగుతున్నదని గణించింది. మంగళవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో లక్ష మందికి 4.4 మంది చొప్పున కరోనాతో మరణించగా, మనదేశంలో 0.3 మంది మాత్రమే చనిపోయారని కేంద్ర వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. కొవిడ్ మరణాల రేటును 3.3శాతం(ఏప్రిల్ 15న) నుంచి నేడు 2.87శాతానికి తగ్గించగలిగామని, ఇది లాక్‌డౌన్‌తో సాధ్యమైందని వివరించారు. అలాగే, ఇప్పటివరకూ 60,490 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ఈ రికవరీ రేటు పెరుగుతున్నదని తెలిపారు. ఇప్పుడు 41.61శాతంగా రికవరీ రేటు ఉన్నదని పేర్కొన్నారు.

Advertisement

Next Story