టి.కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరమే : మధుయాష్కి

by Anukaran |   ( Updated:2020-11-06 08:40:53.0  )
టి.కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరమే : మధుయాష్కి
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని, దుబ్బాక ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నదని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కి గౌడ్ అన్నారు. విజయశాంతి కాంగ్రెస్ వీడరని చెప్పారు. పార్టీ ఆమె సేవలను పూర్తిగా వినియోగించుకోలేదు అనే విమర్శతో తాను ఏకీభవించనని అన్నారు. విజయశాంతి బీజేపీలో చేరరని, నాకన్న ఆమెకే ఆ పార్టీ గురించి బాగా తెలుసని చెప్పారు. కాంగ్రెస్‌లో ఏమన్న సమస్యలు ఉంటే ఠాగూర్ పరిష్కరిస్తాడని తెలిపారు. ఎవరు ఎవర్ని కలిసినా.. పొగిడినా పార్టీ మారరని బీజేపీ నాయకులకు చురకలు అంటించారు.

Advertisement

Next Story