కార్యకర్త అరెస్ట్.. పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన

by Sridhar Babu |
కార్యకర్త అరెస్ట్.. పోలీస్ స్టేషన్ ఎదుట కాంగ్రెస్ నేతల ఆందోళన
X

దిశ, నేలకొండపల్లి: కాంగ్రెస్ కార్యకర్త అక్రమ అరెస్టును నిరసిస్తూ నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం నేలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు, సమీక్ష సమావేశానికి సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హస్తంపై గెలిచి పార్టీ మారినట్లు వెల్లడించారు. గ్రామాల్లోకి వచ్చే ఎమ్మెల్యేని ఏం చేయాలని అనగా కార్యకర్తలు గ్రామాల్లోకి రాకుండా తరమాలని బదులిచ్చారు. ఈ విషయమై పోలీసులు బచ్చలకూరి నాగరాజు అనే యువకుని అరెస్టు చేసి నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు నేలకొండపల్లి పొలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. అక్రమంగా అరెస్ట్ చేసిన కార్యకర్తను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉపేందర్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ ముందు కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఇటువంటి చర్యలు మానుకోవాలి హెచ్చరించారు. అనంతరం పోలీసులు నాగరాజుని విడుదల చేయడంతో బయటకు వస్తూ భట్టి జిందాబాద్, కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఆందోళన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు అంజనీతోపాటు నాయకులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed