బ్యాంకులు పనిచేసేవి రెండు రోజులే…

by srinivas |   ( Updated:2020-12-22 11:17:12.0  )
బ్యాంకులు పనిచేసేవి రెండు రోజులే…
X

దిశ,వెబ్‌డెస్క్: మీకు బ్యాంక్‌లో అకౌంట్ ఉందా? బ్యాంకులో ఏవైనా అత్యవసర పనులు ఉన్నాయా..అయితే ఈ రెండు రోజుల్లో (23,24) పూర్తి చేసుకోండి. లేదంటే 28వ తేది వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఈ నెలలో వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ నెల 25న క్రిస్మస్ పండుగ రావడంతో ఆ రోజున సెలవు ఉంటుంది. కాగా 26న శనివారం అవుతోంది. బ్యాంకు నిబంధనల ప్రకారం రెండవ, నాల్గవ శనివారం సెలవులు ఉంటుంది. కాబట్టి ఈ నెల 26న సెలవు. ఇక 27న ఆదివారం బ్యాంకులకు సెలవు. కాబట్టి ఈ లోగా బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్..లేదంటే మరో మూడు రోజులు పాటు వేచి ఉండాల్సిందే.

Advertisement

Next Story