మా ఊరికి రాకండి.. భయం గుప్పిట్లో వాయిలసింగారం

by vinod kumar |   ( Updated:2021-05-25 02:40:22.0  )
Complete lockdown, Vaila Singaram
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం వాయిలసింగారం గ్రామంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దాదాపు 100పైగా పాజిటివ్ కేసులు ఉండటంతో వైద్యుల సూచన మేరకు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించారు. గ్రామ సరిహద్దులు కంచెలు వేసి మూసివేశారు. ఇతర గ్రామస్తులు రాకండా, సదరు గ్రామస్తులు బయటికి వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ చుండూరు వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. ఎవరి ఇళ్లలో వారు ఉండి బయటకు రాకుండా స్వచ్చంద లాక్ డౌన్‌కు సహకరించాలన్నారు.

Advertisement

Next Story