జిన్నారంలో సంపూర్ణ లాక్‌డౌన్

by Shyam |
జిన్నారంలో సంపూర్ణ లాక్‌డౌన్
X

దిశ, పటాన్‌చెరు: పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో కరోనా వైరస్ వ్యాప్తి విసృతంగా చెందుతున్న నేపథ్యంలో పది రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించాలని పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసింది. ఈ సందర్భంగా సర్పంచ్ అంతిరెడ్డి లావణ్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ…

గ్రామ ప్రజలు నిత్యావసర సరుకులను సరిపడా కొనుగోలు చేసుకోవాలన్నారు. కిరాణా, బంగారం, హార్డ్ వేర్, బట్టల షాపులు, హోటళ్లు ఇతర ఇతర దుకాణాలు తీయరాదని తెలిపారు. లాక్‌డౌన్ ఉన్న రోజులో ఎవరైనా దుకాణాలు తెరిస్తే జరిమానా విధించడం జరుగుతుందని అన్నారు.

Advertisement

Next Story