అక్కడ ఈ నెల 31 వరకూ.. లాక్‌డౌన్

by Sridhar Babu |
అక్కడ ఈ నెల 31 వరకూ.. లాక్‌డౌన్
X

దిశ, కరీంనగర్: రోజురోజుకూ విజృంభిస్తున్న కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు చాలా చోట్ల స్వీయ నిర్భందాన్ని పాటిస్తున్నారు. తాజాగా గంగాధర మండల కేంద్రంలో పాటిటివ్ బాధితుల సంఖ్య పెరిగిపోవడంతో గంగాధర క్రాస్ రోడ్డులోని మధురానగర్ ప్రాంతాన్ని ఈ నెల 31 వరకూ లాక్‌డౌన్ పాటించాలని స్థానికులు నిర్ణయించారు. దుకాణాలను కూడా మూసి వేసి కరోనా కట్టడి కోసం తమవంతుగా కృషి చేయాలని నిర్ణయించారు. హుజురాబాద్ మండలం చెల్పూరు గ్రామంలో కూడా ఆగస్టు 5 వరకూ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. గ్రామంలో కూడా మూడు పాజిటివ్ కేసులు రావడంతో ఈ నిర్ణయం తీసకున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు బయటకు రాకూడదన్న నిభందన పెట్టుకున్నారు.

Advertisement

Next Story