పీవో అజిత్‌రెడ్డిపై ఏసీబీకి ఫిర్యాదు

by Shyam |   ( Updated:2021-08-24 11:50:45.0  )
complaint, ACB
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: కాక‌తీయ అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జ‌రుగుతున్న ప‌నుల్లో పీవో అజిత్‌రెడ్డి అక్రమాల‌కు పాల్పడుతున్నారంటూ ఏఐసీసీ స‌భ్యుడు బ‌క్క జ‌డ్సన్ మంగ‌ళ‌వారం అవినీతి నిరోధ‌క శాఖ డైరెక్టర్ ఆఫ్ జ‌న‌ర‌ల్ పూర్ణచంద‌ర్‌రావుకు ఫిర్యాదు చేశారు. వ‌రంగ‌ల్‌, హ‌న్మకొండ‌ల‌తో పాటు కూడా ప‌రిధిలో జ‌రుగుతున్న లే అవుట్ అనుమ‌తుల్లో అవినీతికి పాల్పడుతున్నట్లుగా ఫిర్యాదులో ఆరోపించారు. అలాగే, వ‌రంగ‌ల్ మండ‌లం ఆరేప‌ల్లిలో ల్యాండ్ పూలింగ్ పేరిట ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమ‌తులు పొంద‌కుండానే ఓ ప్రైవేటు ఏజెన్సీతో ల్యాండ్ స‌ర్వే చేయిస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. బ‌డా రాజ‌కీయ నేత‌ల అండ‌దండ‌లతో అజిత్ రెడ్డి ఏళ్ల త‌ర‌బ‌డిగా పీవో ప‌ద‌విలో కొన‌సాగుతున్నార‌ని, గ‌తంలోనూ ఆయ‌న‌పై అనేక అక్రమాలు, అనినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని ఫిర్యాదులో తెలిపారు. వెంట‌నే ఆయ‌న‌పై విచార‌ణ చేయాల‌ని కోరారు. ఏసీబీతో పాటు సీసీఎల్ఏ ఉన్నతాధికారి హైమావ‌తికి కూడా ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story