సోషల్ మీడియాలో ఫిర్యాదు… స్పందించిన కలెక్టర్

by Sridhar Babu |   ( Updated:2020-08-23 05:46:25.0  )
సోషల్ మీడియాలో ఫిర్యాదు… స్పందించిన కలెక్టర్
X

దిశ, కొత్తగూడెం: భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లా చండ్రుగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలోని వెంగళరాయసాగర్ ప్రాజెక్టు అలుగు కట్టకు ప్రమాదం పొంచి ఉంద‌ని స్థానికులు వాట్సాప్ ద్వారా కలెక్టర్ ఎంవీ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన కలెక్టర్ ప్రాజెక్టుకు సంబంధించిన భ‌ద్ర‌త‌పై పూర్తి నివేదిక‌ అంద‌జేయాల‌ని స్థానిక ఇరిగేష‌న్ శాఖ అధికారుల‌ను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు వెంగలరాయ సాగర్‌ను స్థానిక ఇరిగేషన్ అధికారులు పరిశీలించి నివేదికలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ…

అలుగుకు ఎటువంటి ప్రమాదం లేదని, ఈ ప్రాజెక్ట్ కింద వర్షాకాలం 2200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తున్నట్టు చెప్పారు. ప్రాజెక్టు అలుగు కోతకు గురైన మాట‌ వాస్తవమే అయినా, ప్రస్తుతం అలుగు నీరును తాత్కాలికంగా ప్రత్యామ్నాయ కాల్వ ద్వారా మళ్లిస్తున్నట్టు అధికారులు క‌లెక్ట‌ర్‌కు నివేదించారు. అలుగు పున:నిర్మాణానికి రూ.12 కోట్ల నిధుల అంచ‌నాల‌తో ప్ర‌తిపాద‌న‌లు పంప‌డం జ‌రిగింద‌ని, మంజూరైన వెంట‌నే ప‌నులు ప్రారంభిస్తామని క‌లెక్ట‌ర్ స్ప‌ష్టం చేశారు. రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, సాగుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా నీరు అందించనున్నట్టు ఆయన చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed