గుర్రం చనిపోయిందని డైరెక్టర్ మణిరత్నంపై కేసు

by Anukaran |   ( Updated:2021-09-03 02:34:25.0  )
గుర్రం చనిపోయిందని డైరెక్టర్ మణిరత్నంపై కేసు
X

దిశ, సినిమా: ప్రముఖ డైరెక్టర్ మణిరత్నంతో పాటు అతడి సినిమా ‘పొన్నియన్ సెల్వన్’పై కంప్లయింట్ దాఖలైంది. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా ఓ గుర్రం చనిపోవడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు మణిరత్నం ప్రొడక్షన్ హౌస్ మద్రాస్ టాకీస్‌తో పాటు సదరు గుర్రం యజమానిపై హైదరాబాద్, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

పెటా(పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) ఇండియా కూడా ఈ విషయంలో ఫిర్యాదు చేయగా.. మూవీ డైరెక్టర్‌ను విచారణకు హాజరుకావాల్సిందిగా యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆదేశించింది. తీవ్రంగా అలిసిపోయి, డీహైడ్రేట్ అయినప్పటికీ గుర్రం యజమాని దానితో షూటింగ్ చేసేందుకు అనుమతించాడని తెలుస్తుండగా.. ఈ విషయంపై యానిమల్ వెల్ఫేర్ విచారణ చేపట్టనుంది. అంతేకాదు ‘పెటా’ కంప్లైంట్ ఆధారంగా హైదరాబాద్ పోలీసులు పీసీఏ యాక్ట్ 1960, ఐపీసీ 1860లోని సెక్షన్ 429 కింద కేసు నమోదు చేశారు.

కాగా కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా హిస్టారికల్ డ్రామాగా ఈ చిత్రం రూపొందించబడుతోంది. విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయరామ్, జయం రవి, ఐశ్వర్యలక్ష్మి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభు, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ సపోర్టింగ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం.

Advertisement

Next Story