కనిక కపూర్ ‘నిర్లక్ష్యం’.. కేసు నమోదు

by Shamantha N |   ( Updated:2020-03-21 01:45:59.0  )
కనిక కపూర్ ‘నిర్లక్ష్యం’.. కేసు నమోదు
X

బాలీవుడ్ సింగర్ కనిక కపూర్‌పై లక్నో పోలీసులు కేసు నమోదు చేశారు. నగర చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు మేరకు సింగర్‌పై ‘నిర్లక్ష్యం’ కేసు నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. కరోనా వైరస్ సోకినట్లు బాలీవుడ్ సింగర్ కనిక కపూర్‌ సోషల్ మీడియాలో శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. వారం క్రితం లక్నోలో ఆమె ఓ విందుకు హాజరయ్యారు. ఇందులో పలువురు ఎంపీలు, సీనియర్ రాజకీయ నాయకులు పాల్గొన్నారు. కనికకు కరోనా వైరస్ నిర్ధారణ కావడంతో ఆ విందులో పాల్గొన్న వారంతా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
విదేశాలకు వెళ్లిన కనిక కపూర్ మార్చి 14న స్వదేశానికి తిరిగివచ్చారు. ఆ సమయంలో ఆమెకు లక్నో విమానాశ్రయంలో థర్మల్ స్కీనింగ్ చేయగా కరోనా వైరస్ లక్షణాలు బయట పడ్డాయి. దీంతో డాక్టర్లు కొద్దిరోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించి ఇంటికి పంపించారు. కానీ, ఆమె ఆ విషయాన్ని పట్టించుకోకుండా విందుకు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ సూచనలు పాటించనందుకు కనికపై ఐపీసీ సెక్షన్ 188, 269, 270ల కింద కేసు నమోదు చేశారు.

Tags: Complaint Against, Coronavirus, Singer Kanika Kapoor, Questions

Advertisement

Next Story

Most Viewed