ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు

by Shyam |   ( Updated:2021-03-25 00:25:46.0  )
ప్రభుత్వ భూమిని ఆక్రమించిన ఎమ్మెల్యేపై ఫిర్యాదు
X

దిశ,దామెర: వరంగల్ రూరల్ జిల్లా, గీసుగొండ మండలం, గొర్రెకుంట వద్ద సర్వే నంబర్ 93లో ప్రభుత్వ భూమిని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ఆక్రమించి వారి అనుచరులు, గన్ మెన్ లు, ఇతర పని మనుషులకు సుమారు 15 పక్కా ఇళ్ళు కట్టించి, మున్సిపాలిటీ నుంచి ఇంటి నంబర్లు ఇప్పించి, మిషన్ భగీరథ కనెక్షన్లు కూడా ఇప్పించారని స్థానిక వ్యక్తి భోడ రాకేష్ నాయక్ రాష్ట్ర చీఫ్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆస్తులను తమ సొంత ప్రయోజనాలకోసం రాజకీయ నేతలు వాడుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ విషయంపై వరంగల్ రూరల్ ఆర్డీవో ముందస్తు విచారణ నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story