విషాదంలో కమ్యూనిస్టులు.. కీలక నేత కన్నుమూత

by Anukaran |   ( Updated:2021-05-10 22:56:38.0  )
CPM leader Gouri Amma
X

దిశ, వెబ్‌డెస్క్: భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు(సీపీఐఎం)లో విషాదం చోటుచేసుకుంది. కేరళ వృద్ధ కమ్యూనిస్టు నాయకురాలు గౌరి అమ్మ(102) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆమె ఓ కేరళలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ కారణంగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. కాగా, 1919 జూలై 14న అలప్పుజ జల్లాలోని చెర్తాలాలో అరుమురి పరంబిల్ పార్వతి అమ్మ జన్మించారు. తిరువనంతపురంలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. కేరళలోని ఈజావా వర్గానికి చెందిన మొదటి మహిళా న్యాయ విద్యార్థినిగా ఖ్యాతి సాధించారు.

Communist Party leader Gouri Amma

కేరళలో 1957లో ఈఎంఎస్‌ నంబూద్రిపాద్‌ నేతృత్వంలోని మొదటి కమ్యూనిస్ట్‌ ప్రభుత్వంలో ఆమె తొలి రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేరళ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక నాయకుల్లో అమ్మ ఒకరు. అంతేగాకుండా.. 1994లో పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో జనతిపతియా సంరక్షణ సమితి (జేఎస్‌ఎస్‌) పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో గౌరీ అమ్మ యూడీఎఫ్‌లో విలీనం చేసి.. పార్టీ ప్రభుత్వంలో మరోసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఆమె చివరిసారిగా 2011లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆమె మరణవార్త తెలిసిన కమ్యనిస్టు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

Advertisement

Next Story

Most Viewed