23 ఏళ్ల గ్యాప్ తర్వాత కామన్వెల్త్‌లోకి క్రికెట్.. టీమిండియా ఫస్ట్ మ్యాచ్ ఆ జట్టుతోనే!

by Shyam |
Indian Women Team
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే ఏడాది జూలైలో కామన్వెల్త్ గేమ్స్‌ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నమెంట్‌లో మహిళల క్రికెట్‌ అరంగేట్రం చేయనుంది. దీంతో దాదాపు 23 ఏళ్ల గ్యాప్ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ మరోసారి కనిపించనుంది. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచులోనే భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది. జూలై 29 నుండి ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో మహిళల క్రికెట్ పోటీలు జరుగుతాయి. ఈ మ్యాచులు అన్ని కూడా T20 ఫార్మాట్‌లో జరగనున్నాయి. బంగారు, కాంస్య పతకాల మ్యాచ్‌లు మాత్రం ఆగస్టు 7న జరుగుతాయని ECB తెలిపింది. అయితే, భారత్ వున్న గ్రూపులో పాకిస్థాన్ మహిళల జట్టు కూడా ఉండటంతో ఈసారి ఈ టోర్నీ మరింత ఆసక్తిగా సాగనుంది. జూలై 31న భారత్‌తో పాకిస్థాన్‌ తలపడనుంది. మొత్తానికైతే మహిళల క్రికెట్‌కు రోజురోజుకూ ఆదరణ పెరగడం శుభపరిణామమే అని చెప్పవచ్చు.

Advertisement

Next Story

Most Viewed