- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డిగ్రీల్లో ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్
న్యూఢిల్లీ : వచ్చే విద్యా సంవత్సరం(2021-22) నుంచి అన్ని కేంద్రీయ విశ్వ విద్యాలయాల్లో డిగ్రీలో ప్రవేశాల కోసం కామన్ ఎంట్రెన్స్ నిర్వహించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈ ఎంట్రెన్స్ పరిధిలోకి జవహర్‌లాల్ నెహ్రూ, బనారస్ హిందూ, ఢిల్లీ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. ఇటీవల కేంద్ర క్యాబినెట్ నూతన జాతీయ విద్యావిధానానికి ఆమోదం తెలిపిన విషయం విదితమే. ఒక్కో యూనివర్సిటీకి ఒక్కో పరీక్ష కాకుండా అన్ని యూనివర్సిటీలకు కలపి కామన్ అప్టిట్యూడ్ టెస్ట్‌ను నూతన విద్యావిధానం ప్రతిపాదించింది.
ఈ ప్రతిపాదన అమలుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. 2021-22 విద్యా సంవత్సరం కోసం దేశవ్యాప్తంగా అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యే సమయంలో ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లీ డిగ్రీలో ప్రవేశాలు పొందాలంటే తప్పనిసరిగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఏడాదికి రెండుసార్లు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులపై మార్కుల ప్రభావం, ఒత్తిడి తగ్గించడం కోసం కామన్ ఎంట్రెన్స్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తున్నది.