ఎమ్మెల్సీ ఎన్నికలపై కమిషనర్ కీలక ఆదేశాలు

by Sridhar Babu |
cp-satyanarayana
X

దిశ, కరీంనగర్ సిటీ: స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల పోలింగ్‌లో అధికారులు, ఓటర్లు విధిగా నిబంధనలు పాటించాలని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సూచించారు. అభ్యర్థులు, ఓటర్ల కోసం జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థి వాహనం, ఇతరులెవరు వినియోగించకూడదని, జిల్లా ఎన్నికల అధికారి జారీ చేసే అనుమతి పత్రాలు కలిగిన వాహనాలు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది, అనారోగ్యంతో ఉన్న ఓటర్లు మినహా, ఇతరుల వాహనాలు పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతించరని, పోలింగ్ సమయంలో పీఆర్వో, ఇతర సిబ్బంది మొబైల్ ఫో‌న్‌లను స్విచ్ఛాఫ్ చేయాలన్నారు. అత్యవసరం అయితే బయటకు వెళ్లి మాట్లాడొచ్చని సూచించారు.

పోలింగ్ స్టేషన్‌లో ఎన్నికల ప్రచారం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని, పోలింగ్ బూత్ పరిసరాలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి ఫోన్లు వాడరాదని, జడ్ ప్లస్ భద్రత కలిగిన వ్యక్తులు మినహా ఇతరులెవరు ఆయుధాలతో పోలింగ్ కేంద్రంలోకి రాకూడదన్నారు. మేయర్, ఆపై స్థాయి ప్రజాప్రతినిధులు పోలింగ్ ఎజెంట్లుగా ఉండరాదన్నారు. రూల్స్ ప్రకారం అనుమతి ఉన్న వారికే మాత్రమే ఎంట్రీ ఉంటుందని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed