రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలి

by Shyam |   ( Updated:2020-10-15 09:32:24.0  )
రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, సిద్దిపేట: దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా తోర్నాల గ్రామ శివారులో ఉన్న చెక్ పోస్ట్‌ను సీపీ జోయల్ డెవిస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. చెక్ పోస్ట్‌లలో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండి, వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని సూచించారు.

రాత్రి సమయంలో జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డబ్బులు, మద్యం అక్రమ రవాణా జరగకుండా ముందస్తు జాగ్రత్తగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement

Next Story