- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
త్వరలో విశాఖ నుంచి పాలన ప్రారంభం : మంత్రి అవంతి శ్రీనివాస్
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ త్వరలోనే పాలన అందిస్తారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి అవంతి శ్రీనివాస్ మరికొన్ని రోజుల్లోనే పాలన అంతా విశాఖ నుంచే ప్రారంభం కాబోతుందని తెలిపారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు.. కోరికలు తీర్చే కల్పవల్లి అయిన పైడితల్లి అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మంత్రి అవంతి శ్రీనివాస్ కు ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి అవంతి మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. అమ్మవారి దర్శనం కోసం మూడు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారని చెప్పుకొచ్చారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లి అమ్మవారని, వర్షాలు బాగా పడి రైతులు సంతోషంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండాలని, సీఎం జగన్‌కు మరింత శక్తిని ఇవ్వాలని కోరుతున్నానని అన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాలను జరిపిస్తున్నారని, తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆకాంక్షించారు.