- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ కమెడియన్ వివాదాస్పద వ్యాఖ్యలు.. మీరందరు పెద్ద పత్తిత్తులా అంటూ
దిశ, వెబ్‌డెస్క్: ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్స్ గా మారిన వాళ్లలో కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఒకడు. అర్జున్ రెడ్డి ఫ్రెండ్ శివ పాత్రలో రాహుల్ పాత్రను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఇక ఈ సినిమా తర్వాత రాహుల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ కమెడియన్ గా రాణిస్తున్నాడు. ఇక ఇటీవల సినిమాలతో పాటు ఓటీటీ పై కూడా కన్నేసిన ఈ కమెడియన్ జీ 5 కోసం నెట్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. అవికా గోర్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సిరీస్ సెప్టెంబర్ 10 న స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో రాహుల్ ప్రమోషనల్ వేగాన్ని పెంచాడు. ట్విట్టర్ లో ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తూ వల్గర్ వర్డ్స్ మాట్లాడాడు.. దీంతో రాహుల్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Maa cinema ki guddhalo dum undi#NET
— Rahul Ramakrishna (@eyrahul) August 29, 2021
Oho Twitter lo andaru patheethule anamaata #NET
— Rahul Ramakrishna (@eyrahul) August 29, 2021
‘నెట్’ సినిమాను ఉద్దేశించి రాహుల్ ట్వీట్ చేస్తూ “మా సినిమాకి గు.. లో దమ్ముంది” అంటూ కొంచెం అసభ్య పదజాలాన్ని ఉపయోగించాడు. దీంతో నెటిజన్లు మండిపడ్డారు. ఒక సెలబ్రెటీ అనేది మర్చిపోయి మాట్లాడుతున్నావ్.. ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదా అని కొందరు.. నీ పోస్ట్ ను కొన్ని లక్షల మంది చూస్తారనే కనీసం విజ్ఞత కూడా నీకు లేకుండా పోయింది.. ఇదేనా నీ సంస్కారం అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇంత ట్రోలింగ్ జరుగుతున్నా రాహుల్ జంకకపోవడం విశేషం.. ఆ పోస్ట్ ని డిలీట్ చేయకుండా నెటిజన్లకు కౌంటర్ వేస్తూ “ట్విట్టర్ లో ఉన్న వారందరు పత్తిత్తులే అన్నమాట'” అంటూ ఇంకా రెచ్చగొట్టాడు. ఇంకేముంది ఈ మాటలకు రెచ్చిపోయిన నెటిజన్స్ రాహుల్ ని ఆడేసుకుంటున్నారు. మరికొందరు మాత్రం రాహుల్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. సెలబ్రెటీలు అయితే ఇలానే మాట్లాడాలి అనే రూల్ ఏమైనా ఉందా..? వాళ్లు మాత్రం మనుషులు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ రచ్చ ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.
- Tags
- NET