టీటీడీ ఆస్తుల వేలంపై పోరు ప్రారంభిద్దాం రండి: కన్నా

by srinivas |
టీటీడీ ఆస్తుల వేలంపై పోరు ప్రారంభిద్దాం రండి: కన్నా
X

దిశ, ఏపీ బ్యూరో: టీటీడీ ఆస్తుల వేలంపై ఇంటి నుంచే పోరాటం ప్రారంభిద్దామని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ట్విట్టర్ మాధ్యమంగా ఆయన జీవో 39పై పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. దీనిపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని ఆయన ప్రకటించారు. భక్తులంతా రేపు సోషల్ మీడియా ఖాతాలలో ప్రొఫైల్ పిక్ మార్చడం ద్వారా హిందూ వ్యతిరేకతపై పోరాడాలని ఆయన సూచించారు.

తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన భూములను అమ్మే హక్కు మీకెవరిచ్చారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా వెంకన్న భక్తులు, బీజేపీ శ్రేణులు, హిందూ సంస్థలు రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి వారి ఇళ్ల దగ్గర్నుంచి “నిరసనదీక్ష” చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. టీటీడీ భూములను వైఎస్సార్సీపీ ప్రభుత్వం విక్రయించడం హిందూ మనోభావాలను దారుణంగా అవమానించడమేనని కన్నా అభిప్రాయపడ్డారు. ఈ మేరకు తన ప్రొఫైల్ పిక్‌ను మార్చేసిన కన్నా లక్ష్మీ నారాయణ శ్రీవారి ఫొటో పెట్టుకున్నారు. తిరుమల రుపతి దేవస్థానం, సింహాచలం భూముల రక్షణ కోసం పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed