Huzurabad ఉపఎన్నిక విధుల్లో అలా చేయకండి: కలెక్టర్

by Sridhar Babu |   ( Updated:2021-09-29 08:52:04.0  )
Huzurabad ఉపఎన్నిక విధుల్లో అలా చేయకండి: కలెక్టర్
X

దిశ, హుజురాబాద్: ఉపఎన్నిక విధుల్లో పాల్గొనే అధికారులు నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఫ్లైయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్స్ సర్వైవల్ బృందాలు, సెక్టోరల్ అధికారులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గానికి అక్టోబర్ 30న జరుగనున్న ఉప ఎన్నికను పకడ్బందీగా, శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో జరిగే వయోలెన్స్ ఫిర్యాదులకు వెంటనే స్పందించాలన్నారు.

ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ బృందాలు ఎన్నికలు జరిగే వరకు 24 గంటల పాటు మూడు షిఫ్టులలో పని చేస్తాయని తెలిపారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కేసులు బుక్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారంలో మద్యం, నగదు, బహుమతులు పంపిణీ చేసే వారిపై నిఘా పెట్టాలన్నారు. పక్షపాతం, వ్యతిరేకత లేకుండా విధులను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఉప ఎన్నిక విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తప్పని సరిగా తీసుకోవాలని కలెక్టర్ మరోసారి స్పష్టం చేశారు. మాస్కు తప్పని సరిగా ధరించాలని, చేతులు శానిటైజ్ చేసుకోవాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed