‘మేడ్చల్‌ను హరిత జిల్లాగా తీర్చిదిద్దాలి’

by Shyam |
‘మేడ్చల్‌ను హరిత జిల్లాగా తీర్చిదిద్దాలి’
X

దిశ,మేడ్చల్: మేడ్చల్‌ను హరిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం శామీర్ పేట మండలంలోని హకీంపేట నుంచి తుర్కపల్లి వరకు గల రాజీవ్ రహదారికి ఇరువైపులా మొక్కలు నాటే గుంతలను, మొక్కలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ.. జూన్ 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల అనంతరం రహదారికి ఇరుపక్కలా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. శామీర్‌పేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్య పనులను, ప్రహారీ, గార్డెన్ పనులను, మొక్కలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

Advertisement

Next Story